ePaper
Sunday, September 6, 2026

చిలుకమర్రిలో చిరుత కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు!

గుడిపల్లి మండలం చిలుకమర్రి గ్రామ పరిసరాల్లో చిరుతపులి సంచరించినట్లు సమాచారం రావడంతో గ్రామస్థుల్లో భయాందోళన నెలకొంది.

ఆదివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో చిరుత కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్థులు అప్రమత్తమయ్యారు.

చిరుత సంచారంపై అధికారులు వెంటనే స్పందించి ప్రాంతాన్ని పరిశీలించి, నిజానిజాలను నిర్ధారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

రాత్రివేళల్లో ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

చిలుకమర్రిలో నిజంగానే చిరుత సంచరిస్తుందా..?
అధికారుల పరిశీలనలో తేలాల్సి ఉంది!


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!