ePaper
Friday, July 24, 2026

పాటల సందడిలో ఘనంగా గోరింటాకు పండుగ.

చీకటి వెలుగు నలగొండ.

పట్టణంలోని 34వ వార్డు బండారు గార్డెన్స్‌వద్ద మహిళలు ఆషాఢ మాస గోరింటాకు పండుగను సంప్రదాయబద్ధంగా, ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు గోరింటాకు ఆకులను సేకరించి దంచి చేతులకు అలంకరించుకున్నారు. “రెంటాకు పూసింది కొమ్మా లేకుండా…” అంటూ సంప్రదాయ జానపద గీతాలు ఆలపిస్తూ ఉత్సాహంగా నృత్యాలు చేసి పండుగ వాతావరణాన్ని సృష్టించారు. మహిళలు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆషాఢ మాస విశిష్టతను చాటారు.
ఇలాంటి సంప్రదాయ వేడుకలు భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలను పరిరక్షించడంతో పాటు మహిళల్లో ఐక్యతను పెంపొందిస్తాయని పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బండారు కళారాణి, బండారు రమణి, కుంభం జ్యోతి, కర్నాటి శ్రీలత, గండూరి ఉమా, కవిత, శ్రావణి, రెగట్టే పద్మ, విజయ, రాణి, దేవకి తదితర మహిళలు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!