నల్లగొండ: జిల్లా కేంద్రంలోని ప్రత్యేక ఉప కలెక్టర్ కార్యాలయం, జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది ఆలస్యంగా విధులకు హాజరవుతున్నారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం 11 గంటలు దాటినా కార్యాలయాల్లో పలువురు అధికారుల కుర్చీలు ఖాళీగానే కనిపించాయని, దీంతో తమ పనుల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సమయపాలన పాటించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది నిర్ణీత సమయానికి విధులకు హాజరయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments