ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత డిమాండ్.
చీకటి వెలుగు నల్లగొండ.
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేసి గాయపరిచారంటూ ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం శాంతియుత ధర్నా నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు నల్గొండ రామగిరిలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు.
డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు విగ్రహం ఎదుట బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పున్న కైలాష్ నేత మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కే చర్యలు సరికాదని ఆయన అన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరీక్షల అవకతవకలపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని డిమాండ్ చేశారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, యువత, రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జిల్లపల్లి పరమేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోడ స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ముంతాజ్ అలీ, సిరాజ్ ఖాన్, ప్రధాన కార్యదర్శులు గోపిశెట్టి రాంబాబు, కుకుడాల బాలకృష్ణ, ఏళ్ల రవీందర్ రెడ్డి, మేకల రాజేందర్ రెడ్డి, చిట్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, శాలిగౌరారం మండల అధ్యక్షుడు చింత ధనుంజయ్, మధు ప్రసాద్, పోకల దేవదాస్, కట్టం వెంకన్న, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, సంతోష్ రెడ్డి, మనోహర్, నలపరాజు సీనయ్య, కాటం వెంకన్న గౌడ్, దేవరకొండ కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ గౌడ్, వేముల గోపినాథ్, ఆకటి సైదులు, సైదులు యాదవ్, మధగోని వెంకన్న, ఇందనూరి శ్రీను, ఎండి ఫిరోజ్, గడ్డం దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments