చీకటి వెలుగు నల్లగొండ.
తెలంగాణ విశ్వకర్మ మనుమయ సంఘం నల్గొండ జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కాసోజు విశ్వనాథముచారి అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు సుంకోజు కృష్ణమాచారి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు చక్రహరి రామరాజు, గౌరవ అధ్యక్షుడు కుందారపు గణేష్ చారి హాజరై ప్రసంగించారు. విశ్వకర్మల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సంఘ బలోపేతం కోసం సభ్యులంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటికొండ శ్రీరాములు, కోశాధికారి గంధాల శ్రీనివాసాచారి, కార్యదర్శులు కె.కె. చారి, ఆనందోజు సత్యనారాయణ, ఉప్పల లక్ష్మీనారాయణ, ఉడుముల బ్రహ్మచారి, మెడోజు రామరాజు, పోలోజు రమేష్ చారి, జిల్లా నాయకులు గుంటోజు బ్రహ్మచారి, కాసోజు శంకరాచారి, కపలవాయి జంగాచారి, చల్లోజు నర్సింహాచారి, ఇడికోజు వెంకటాచారి, పెరికెటి మురళి, శిరసగండ్ల ఈశ్వరాచారి, సంకోజు జేజయ్య, కూరెళ్ల రమణాచారి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నల్గొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా చోల్లెటి రమేష్, ప్రధాన కార్యదర్శిగా గుంటోజు వెంకటాచారి, ఉపాధ్యక్షుడిగా శిరసగండ్ల ఈశ్వరాచారి, కోశాధికారిగా సంకోజు జేజయ్య, ప్రచార కార్యదర్శిగా పోలోజు శివకుమార్, కార్యదర్శిగా తుంగతుర్తి శంకర్ ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ జిల్లా వ్యాప్తంగా విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. అనంతరం రాష్ట్ర నాయకులు, జిల్లా ప్రముఖులు నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments