చీకటి వెలుగు నల్లగొండ.
చర్లపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికల్లో ముషం రవి వర్గం ఘన విజయం సాధించిన నేపథ్యంలో నూతన పాలకవర్గం ఆదివారం ప్రమాణ స్వీకారం చేసింది. సంఘం అధ్యక్షుడిగా ముషం రవి (తండ్రి: సాంబయ్య) బాధ్యతలు స్వీకరించారు. పాలకవర్గ సభ్యులుగా గంజి రమేష్ (తండ్రి: బక్కయ్య), గంజి రమేష్ (తండ్రి: ఈశ్వరయ్య), రాపోలు గణేష్ (తండ్రి: రంగయ్య శ్రీశైలం), చిట్టిప్రోలు రమేష్ (తండ్రి: పుల్లయ్య), కటకం వెంకటేశ్వర్లు, రాపోలు శేషమ్మ, గంజి వెంకమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ముషం రవి మాట్లాడుతూ, సహకార సంఘం ద్వారా సభ్యులతో పాటు చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు సకాలంలో అందేలా కృషి చేస్తానని తెలిపారు. సంఘం అభివృద్ధికి సభ్యులందరి సహకారంతో పారదర్శకంగా పనిచేస్తానని పేర్కొన్నారు. అనంతరం అభిమానులు, సంఘ సభ్యులు నూతన పాలకవర్గాన్ని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. స్వీట్లు పంచుకొని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాపోలు శ్రీనివాసులు, రాపోలు శంకర్, వేణుబాబు, గుర్రం నరేందర్, గంజి రమేష్ (చుక్కయ్య), గంజి పాండరి, సీహెచ్ కిరణ్, రాజుతో పాటు పలువురు సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments