ePaper
Friday, September 4, 2026

చీకటి వెలుగు నల్లగొండ.ఐకాన్ 100 బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలతో ముందడుగు:

నల్గొండ వైద్య రంగంలో మరో చారిత్రాత్మక అడుగు – ఐకాన్ హాస్పిటల్లో 100 మెదడు కణితుల శస్త్రచికిత్సలు విజయవంతం

ఒకప్పుడు మెదడు కణితి (బ్రెయిన్ ట్యూమర్) అని నిర్ధారణ అయిన వెంటనే నల్గొండ జిల్లా ప్రజలు హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కుటుంబ సభ్యులను వదిలి, నెలల తరబడి అక్కడ ఉండాల్సి రావడం, లక్షల రూపాయల వైద్య ఖర్చులు భరించడం అనేక కుటుంబాలకు తీవ్రమైన ఆర్థిక మరియు మానసిక భారంగా మారేది.

ఆ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో నల్గొండలోనే అత్యాధునిక న్యూరో సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఐకాస్ హాస్పిటల్ నేడు మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు 100 బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి, రోగులందరినీ చికిత్స అనంతరం ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేయడం నల్గొండ వైద్య చరిత్రలో ఒక విశేష మట్టంగా నిలిచింది.

ఈ వంద కేసులో సాధారణ శస్త్రచికిత్సలతో పాటు అత్యంత క్లిష్టమైన మరియు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మెదడు కణితి కేసులు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో ఇలాంటి చికిత్సలకు దాదాపు 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు అయ్యే సందర్భాలు ఉన్నప్పటికీ, ఐకాన్ హాస్పిటల్లో అదే స్థాయి వైద్య సేవలను చాలా తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం.

మా లక్ష్యం కేవలం శస్త్రచికిత్సలు చేయడం కాదు – గ్రామీణ మరియు పట్టణ ప్రజల మధ్య ఉన్న వైద్య అసమానతను తగ్గించడం. ప్రపంచ స్థాయి సాంకేతికత, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, అత్యాధునిక పరికరాలు మరియు అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ రాజేష్ గారు మరియు డాక్టర్ శశాంక కోడ, డాక్టర్ సాయి మౌనికి చెరుకూరి మరియు డాక్టర్ సాయి లావణ్య కడిమి గారి నేతృత్వంలోని న్యూరో సర్జరీ మరియు క్రిటికల్ కేర్ బృందంతో పెద్ద నగరాల్లో లభించే చికిత్సను నల్గొండ ప్రజలకు వారి సొంత జిల్లాలోనే అందించాలనే ప్రయత్నమే ఈ విజయానికి కారణం.

ప్రతి విజయవంతమైన శస్త్రచికిత్స వెనుక ఒక కుటుంబం తిరిగి ఆశను పొందింది. ఒక తల్లి తన పిల్లల వద్దకు చేరుకుంది, ఒక తండ్రి తన బాధ్యతలను తిరిగి స్వీకరించాడు. ఒక యువకుడు తన భవిష్యత్తును మళ్లీ నిర్మించుకునే అవకాశం పొందాడు. ఈ 100 కేసులు కేవలం సంఖ్య కాదు 100 కుటుంబాలకు తిరిగి లభించిన ఆశ మరియు ఆనందానికి ప్రతీక.

ఈ ప్రయాణంలో మాపై నమ్మకం ఉంచిన రోగులు, వారి కుటుంబ సభ్యులు, నల్గొండ ప్రజలు, వైద్యులు మరియు మా మొత్తం సిబ్బందికి ఐకాన్ హాస్పిటల్ హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలియజేస్తోంది.

భవిష్యత్తులో కూడా మరింత అధునాతన న్యూరో సర్జరీ సేవలు, అత్యవసర మెదడు మరియు వెన్నుపూస చికిత్సలు, అత్యుత్తమ వైద్య ప్రమాణాలతో నల్గొండ ప్రజలకు అందించడం మా బాధ్యతగా భావిస్తున్నాము.

“పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక వైద్యం ఇప్పుడు నల్గొండ ప్రజలకు వారి ఇంటి వద్దే అందుబాటులో ఉంది- ఇదే ఐకాన్ హాస్పిటల్ సంకల్పం”


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!