నల్లగొండ, జూన్ 11: ఎస్ఎల్బీసీ (SLBC) కాలువ లైనింగ్ పనులను రూ.450 కోట్ల వ్యయంతో చేపట్టినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి Komatireddy Venkat Reddy తెలిపారు.
బుధవారం నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ కాలువ లైనింగ్ పనులను మంత్రి పరిశీలించి, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కాలువ ఆధునీకరణ ద్వారా సాగునీటి పంపిణీ మరింత సమర్థవంతంగా జరిగి రైతులకు అధిక ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ రంగాభివృద్ధి, నీటి వనరుల సమర్థ వినియోగం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాలువ లైనింగ్ పనులు పూర్తయితే చివరి భూముల వరకు సాగునీరు చేరి రైతాంగానికి మేలు జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ సీఈ గంగం శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ బద్రు నాయక్, ఈఈ నెహ్రూ, డిఈ జితేందర్, ఏఈ గౌతమి, జేఈ శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments