విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా వినోద్ కుమార్ అందించిన సేవలు మరువలేనివని క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ ప్రకాష్ పేర్కొన్నారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో వినోద్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఉద్యోగ బాధ్యతలను వినోద్ కుమార్ నిబద్ధతతో, సమర్థవంతంగా నిర్వహించారని ప్రశంసించిన ప్రకాష్, ఆయన సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వినోద్ కుమార్ దంపతులను ఇంజనీర్లు గజమాలలు, శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments