వయోవృద్ధులు, దివ్యాంగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ప్రతినెలా చివరి శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న “ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని” వయోవృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ వయోవృద్ధులు, దివ్యాంగుల నుంచి సమస్యల పరిష్కారానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 64 మంది హాజరై తమ వినతిపత్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతి దరఖాస్తును స్వయంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
ప్రజావాణిలో పెన్షన్లు, సదరం సర్టిఫికెట్లు, పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోని కేసులు, భూముల సమస్యలు తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్‌కుమార్, జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ, మునుగోడు సీడీపీవో లావణ్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments