నల్గొండ పట్టణంలోని శ్రీ స్రవంతి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సీ 2025–26 ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారు.
ఈ ఫలితాల్లో
- వి. సాయి చందన 567 మార్కులతో ప్రథమ స్థానం సాధించింది
- బి. చైత్ర శ్రీ 560 మార్కులతో ద్వితీయ స్థానం పొందింది
- నందిని, శివరాణి 559 మార్కులు
- శివరాం 557 మార్కులు
- సాత్విక 552 మార్కులు
- ఉషశ్రీ 550 మార్కులు సాధించి ప్రతిభ చాటారు
మొత్తంగా 550 మార్కులకు పైగా 7 మంది, 500 మార్కులకు పైగా 27 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం గమనార్హం. ఈ విజయాలతో పాఠశాల పట్టణంలో అగ్రగామి విద్యాసంస్థగా నిలిచింది.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ వారణాసి రజనీకాంత్, ప్రిన్సిపల్ ఎస్. ఉమా వెంకటరమణ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించి, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments