ePaper
Friday, May 1, 2026

జాతీయ రహదారి అక్రమాలపై మళ్లీ బీజేపీ ఆందోళన

నల్లగొండ: జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై బీజేపీ మరోసారి ఆందోళనకు దిగింది. ఈ వ్యవహారంపై జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు.

గతంలో కూడా హైవే నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తూ నిరసనలు చేపట్టారు. అయితే నిరసనల తర్వాత కూడా ఎలాంటి మార్పు రాకపోవడంతో పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

హైవే అథారిటీ ఇంజినీర్లు తనిఖీలు పేరుకే నిర్వహించారని, తూతూ మంత్రంగా వ్యవహరించి తాము ఎంచుకున్న ప్రదేశాల్లోనే సాయిల్ టెస్టులు చేశారని ఆరోపించారు. ప్రజలు చూపించిన ప్రాంతాల్లో పరీక్షలు చేయకుండా కాంట్రాక్టర్‌ను కాపాడేందుకే అధికారులు ప్రయత్నిస్తున్నారని నాగం వర్షిత్ రెడ్డి విమర్శించారు.

ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌కు వెళ్లి రాష్ట్ర R&B శాఖ హెడ్ ఆఫీస్‌లో ఆర్వో కృష్ణ ప్రసాద్ ను కలిసి ఫిర్యాదు చేశారు. నాణ్యతలేని మట్టి వినియోగం, లోపభూయిష్ట నిర్మాణంపై పూర్తి వివరాలను సమర్పించినట్లు తెలిపారు.

అధికారులు ఫిర్యాదులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తూ, వెంటనే థర్డ్ పార్టీ ద్వారా సాయిల్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ అంశాన్ని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని హెచ్చరించారు.

నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, కాంట్రాక్టులు రద్దు చేసి నాణ్యతతో కూడిన రహదారిని తిరిగి నిర్మించాలని కూడా డిమాండ్ చేశారు.

జిల్లాలో హైవే నిర్మాణంపై అవినీతి ఆరోపణలు మరింత ముదురుతాయా, లేక అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!