ePaper
Wednesday, April 29, 2026

నల్గొండ: మే 3న తెలంగాణ రన్ ప్రోమో రన్ నిర్వహణ

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా సొసైటీ ఫర్ తెలంగాణ రన్ ఆధ్వర్యంలో మే 3న నల్గొండలో ప్రోమో రన్ నిర్వహించనున్నట్లు సంస్థ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మగ్గారి శ్రీనివాస్ తెలిపారు.

నల్గొండలోని ఎన్‌జీ కళాశాల వద్ద ఉదయం 6 గంటలకు ఈ రన్ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై రన్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు బుధవారం మగ్గారి శ్రీనివాస్, సొసైటీ ఈసీ మెంబర్ రాఘవ్, నల్గొండ జిల్లా వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి బండారు ప్రసాద్, డాక్టర్ పుల్లారావు కలిసి జిల్లా కలెక్టర్‌ను ఆయన ఛాంబర్‌లో కలసి ఆహ్వానించారు.

రాష్ట్రంలోని 10 జిల్లాల్లో “తెలంగాణ రన్” పేరుతో 2కే, 5కే రన్‌లు నిర్వహిస్తున్నామని, మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కల్పించడం, తెలంగాణ స్ఫూర్తిని విస్తరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

మే 3 ఉదయం 6 గంటలకు కలెక్టర్ చేతుల మీదుగా నల్గొండ ప్రోమో రన్ ప్రారంభం కానుంది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!