ePaper
Wednesday, May 13, 2026

వ్యాపారాభివృద్ధితోనే పట్టణాభివృద్ధి : మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

చీకటి వెలుగు-నల్గొండ ప్రతినిధి:

నల్లగొండ పట్టణం వేగంగా అభివృద్ధి చెందాలంటే వర్తక, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

బుధవారం దేవరకొండ రోడ్డులో నూతనంగా ప్రారంభమైన “అనిత షారీస్ సెంటర్”ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వివాహాది శుభకార్యాల కోసం హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నల్లగొండలోనే అన్ని ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ చీరలు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు.

ఇలాంటి వ్యాపార సంస్థలు పెరగడం వల్ల పట్టణ ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో అనిత షారీస్ ఓనర్ కందిమల్ల సైదిరెడ్డి, కార్పొరేటర్ పెళ్లి కృష్ణంరాజు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!