ఘనంగా శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 13వ వార్షికోత్సవ వేడుకలు
నల్గొండ పట్టణంలోని ముషంపల్లి రోడ్డులోని సాయినగర్‌లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 13వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం కాకడ హారతి, విఘ్నేశ్వర పూజ, మూల విరాట్ సాయిబాబా విగ్రహానికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, దివ్య దర్శనం నిర్వహించారు.
మధ్యాహ్నం హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు.
రాత్రి నిర్వహించిన పల్లకి సేవ, ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పరవశంలో మునిగిపోయారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బుర్రి భూపతిరెడ్డి, వైస్ చైర్మన్ గొర్రె సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి కోటిరెడ్డి, సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments