ePaper
Saturday, September 5, 2026

ఉద్యోగ హక్కుల సాధన సభకు కదలాలి

సెప్టెంబర్‌ 10న ‘చలో హైదరాబాద్‌’ను విజయవంతం చేయాలి

చీకటి వెలుగు నల్లగొండ,

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల హక్కుల సాధన కోసం సెప్టెంబర్‌ 10న హైదరాబాదులో నిర్వహించనున్న ‘ఉద్యోగ హక్కుల సాధన సభ–చలో హైదరాబాద్‌’ను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమం సన్నాహాల్లో భాగంగా నల్గొండ–సూర్యాపేట జిల్లాల సన్నాహక సమావేశాన్ని నల్గొండలో నిర్వహించారు. సమావేశానికి జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్‌, ఏలూరి శ్రీనివాసరావు, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్‌ జేఏసీ సహాధ్యక్షుడు చావా రవి, టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్‌ హుస్సేన్‌, సహాధ్యక్షులు సత్యనారాయణగౌడ్‌, కస్తూరి వెంకటేశ్వర్లు, పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్‌ తదితరులు హాజరై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను వివరించారు. సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లో లక్ష మందితో ఉద్యోగ హక్కుల సాధన సభ నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్‌ అధికారులు, కార్మికులు, పెన్షనర్లు, అనుబంధ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. నల్గొండ జిల్లా టీజీఈజేఏసీ భాగస్వామ్య సంఘాల ప్రతినిధులు నాగిళ్ల మురళి అధ్యక్షతన సమావేశమై తమ సంఘాల నుంచి అధిక సంఖ్యలో ఉద్యోగులను హైదరాబాద్‌కు తరలించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో జె.శేఖర్‌రెడ్డి, తిరుపతయ్య, అంజిరెడ్డి, సోమయ్య, రాధాకృష్ణ, ఉపేందర్‌రెడ్డి, జితేందర్‌, కృష్ణమూర్తి, దున్న శ్యామ్‌, గోపాల్‌రెడ్డి, యాకూబ్‌నాయక్‌, చేపూరి నరసింహాచారి, వెంకటేశ్వరం, జనార్ధన్‌, ఏడుకొండలు, భిక్షం, అలీమ్‌, సందీప్‌, కే.రాంబాబు, జీవన్‌రెడ్డి, శాంసుందర్‌, అజీముద్దీన్‌, ఏలూరి లక్ష్మయ్య, ఖాసిం, జయరావు, ఆకనూరి లక్ష్మయ్య, కే.మనోజ్‌ప్రదీప్‌, డీ.సాయిదులు, రణదేవి, భాస్కర్‌, రమ్యసుధా, సుమలత, కరుణశ్రీ తదితర నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించి సెప్టెంబర్‌ 10న నిర్వహించే ‘చలో హైదరాబాద్‌’ను చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!