ePaper
Thursday, September 3, 2026

28వ డివిజన్ లో మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్ గుండెబోయిన పుష్పలత వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలోపేదలకు కళ్లద్దాల పంపిణీ*

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 28 డివిజన్ లో నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు

చీకటి వెలుగు నల్లగొండ

డివిజన్ లో ఒంటి స్తంభం వద్ద శివాలయంలో మేయర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు*

అనంతరం స్థానిక కార్పొరేటర్ గుండెబోయిన పుష్పలత వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు

ఈ సందర్భంగా డివిజన్ లోని అర్హులైన, అవసరం ఉన్న పేదలకు మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కళ్లద్దాలను పంపిణీ చేశారు

28వ డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తానని మేయర్ తెలిపారు
తన పుట్టినరోజు సందర్భంగా డివిజన్లోని పేదలకు కళ్లద్దాలు పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు
ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ గుండెబోయిన పుష్పలత వెంకటేశ్వర్లును అభినందించారు

కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, యాదవ సంఘం నాయకులు, స్థానిక నాయకులు జెల్లా సత్తయ్య, దాసోజు వాసు, జి.లోహిత్, ఎండి నజర్ భాయ్, జి. పవన్, భాగ్యలక్ష్మి, మండల జ్యోతి ,ఉడత సత్యవతి, అశోక్, నాగరాజు ,సురేష్, గౌడ్, బషీర్, షఫీక్, చెన్నగోని వెంకన్న ,ప్రేమ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!