తెలంగాణ ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ సమితి
చీకటి వెలుగు నల్లగొండ.
సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘సీపీఎస్ రద్దు–ఓపీఎస్ అమలు’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ నాగిళ్ల మురళి మాట్లాడుతూ సీపీఎస్ విధానం ఉద్యోగుల పదవీ విరమణ అనంతర పెన్షన్ భద్రతకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే పాత పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. జిల్లా కన్వీనర్ బి.యాదగిరి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ హక్కు సాధించే వరకు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ పదవీ విరమణ అనంతర జీవితానికి భరోసా కల్పించే పెన్షన్ ప్రతి ఉద్యోగి హక్కు అన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టప్రా రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, టీఎన్‌జీవోస్ కార్యదర్శి జే.శేఖరెడ్డి, సైదులు, కె.రాంబాబు, యాకుబ్ నాయక్, వెంకట్‌రామ్‌రెడ్డి, వాసుదేవరావు, చేపూరి నర్సింహాచారి, డీఐ రాజు, ఆకనూరి లక్ష్మయ్య, టి.సైదులు, కె.మనోజ్ ప్రదీప్, రణదేవే భాస్కర్, కాశిం, అజీముద్దీన్, ధారావత్ సైదులు, గోవర్ధన్‌రెడ్డి, బైరబోయిన భిక్షం, అనుగుల భిక్షమయ్య, ఉదయ్, సత్యనారాయణ, మహమూద్, రవినాయక్, సునీత, విజయశాంతి, శంకర్‌రెడ్డి, సుమన్ తదితర టీజీఈజేఏసీ నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సీపీఎస్ రద్దు చేయాలి–ఓపీఎస్ అమలు చేయాలి’, ‘పాత పెన్షన్ సాధించే వరకు పోరాటం ఆగదు’, ‘మన పెన్షన్–మన హక్కు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసే వరకు ఉద్యోగుల ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments