ePaper
Saturday, June 27, 2026

మోదీ పాలనకు 12 ఏళ్లు.. విద్యార్థులకు ఉచిత విద్యా సామగ్రి పంపిణీ

చీకటి వెలుగు నల్లగొండ,జూన్ 24

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్‌కేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నల్లగొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ నల్లగొండ పార్లమెంట్ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు యూసుఫుద్దీన్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, ఎగ్జామ్ ప్యాడ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని పేర్కొన్నారు. పేద మరియు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి అందించడం ద్వారా వారి చదువుల పట్ల ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.
ఆర్‌కేఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పిల్లి రామరాజు మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, ఆర్థిక ఇబ్బందులు వారి చదువులకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గత పదేళ్లుగా విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో పలు కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరించనున్నట్లు వెల్లడించారు.
ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేదలకు సహాయం చేయడం, వైద్య చికిత్స పొందుతూ మృతిచెందిన పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం వంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధే దేశ అభివృద్ధికి పునాది అని, నేటి విద్యార్థులే రేపటి భారత నిర్మాణ శిల్పులని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌కేఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిల్లి కృష్ణంరాజు యాదవ్, డివిజన్ కార్పొరేటర్. పిల్లి శివరాజ్ యాదవ్ (ఎన్‌ఆర్‌ఐ), 25వ డివిజన్ కార్పొరేటర్ నవ్యశ్రీ, బీజేపీ నాయకులు బండారు ప్రసాద్, ఊట్కూరి వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేసి వారి విద్యాభివృద్ధికి శుభాకాంక్షలు తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!