నల్గొండ, జూన్ 26:

ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి A. Revanth Reddy నల్గొండ జిల్లా పర్యటన ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ Vikas Raj ఆదేశించారు.

శుక్రవారం నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానం, కనగల్‌లో ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న రూ.13,006 కోట్ల విలువైన హ్యాం రోడ్ల శంకుస్థాపన పైలాన్‌ను ఆయన పరిశీలించారు.
ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ వేదిక, ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న టెంట్లు, జర్మన్ హ్యాంగర్లు, కుర్చీలు, లైటింగ్, సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీ స్క్రీన్లు, బ్యారికేడింగ్ తదితర ఏర్పాట్లను సంబంధిత అధికారులతో సమీక్షించారు. వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి జిల్లా చేరుకున్నప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు పర్యటన నిరాటంకంగా కొనసాగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి సభా ప్రాంగణానికి చేరుకున్న వెంటనే రెండు వైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసేలా ఇప్పటికే ఉన్న కాంక్రీట్ వేదికను సిద్ధం చేయాలని, ర్యాంప్ లేదా ప్రత్యేక వాహనం ద్వారా అక్కడికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని, భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం కనగల్ మార్కెట్ యార్డు సమీపంలోని హ్యాం రోడ్ల శంకుస్థాపన పైలాన్‌ను పరిశీలించి, రంగుల వినియోగం, సుందరీకరణ పనులు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను కూడా ఆయన పరిశీలించారు.
ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ B. Chandrasekhar, ఎస్పీ Sharath Chandra Power, అదనపు కలెక్టర్లు, ఆర్అండ్బీ అధికారులు, రవాణా శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments