ePaper
Friday, June 26, 2026

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా బాకీ నరసింహ.

చీకటి వెలుగు నల్లగొండ,

నల్లగొండ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా జిల్లా నల్లగొండ మండలం కాకుల కొండారం గ్రామానికి చెందిన, బాకీ నరసింహను నియమిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా బాకి నరసింహ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా రాష్ట్ర నాయకులకు రాష్ట్ర అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఎస్సీ మోర్చా ను బలోపేతం చేసి పార్టీని పటిష్టపరుస్తామన్నారు. తాను బిజెపి పార్టీలో గతంలో
.1999 నుండి కార్యకర్తగా. గ్రామ శాఖ అధ్యక్షునిగా. దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శిగా. దళిత మోర్చా మండల అధ్యక్షులుగా. దళిత మోర్చా ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా బిజెపి నల్గొండ మండల ప్రధాన కార్యదర్శిగా. విద్యా కమిటీ వైస్ చైర్మన్ గా. విద్యా కమిటీ చైర్మన్ గా.ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా బిజెపి నల్గొండ మండల ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు.ప్రస్తుతం కొండారం గ్రామపంచాయతీ మూడో వార్డు మెంబర్గా బాకీ సైదమ్మ. నాలుగో వార్డు బాకీ నరసింహ లు పనిచేస్తున్నారు. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా ఎన్నికై నందున నరసింహులుకు పలువురు బిజెపి నాయకులు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!