సీఎం బహిరంగసభకు భారీగా తరలిరావాలి
నల్లగొండ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
చీకటి వెలుగు నల్లగొండ..
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 28న కనగల్ మండల కేంద్రంలో 13వేల కోట్ల వ్యయంతో నిర్మించే R&B హ్యం రోడ్ల పనుల పైలాన్ శంకుస్థాపన అనంతరం ఎన్జీ కళాశాలలో నిర్వహించే భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో తరలిరావాలని నల్లగొండ నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు
శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాప్ కార్యాలయంలో నలగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అధ్యక్షతన సీఎం రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ విజయవంతంపై సన్నాహక సమావేశం మరియు SIR పై నల్లగొండ పట్టణ, మండలానికి సంబంధించి పార్టీ ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు
సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు.
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందజేస్తుందని తెలిపారు.
*ఈనెల 28న జరిగే సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ చారిత్రాత్మకంగా నిలుస్తుందన్నారు.
ఈ సభకు పార్టీ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.
నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఓటరు సవరణ కార్యక్రమం (SIR) పై ఎవరు నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.
కేంద్రం తనకు అనుకూలంగా లేని ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలంతా దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈనెల 28న ఎన్జీ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు నల్గొండ నియోజకవర్గం నుంచి 60 వేల మందికి పైగా జన సమీకరణ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ప్రతి గ్రామం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి గారు కనగల్ వద్ద హ్యం రోడ్ల నిర్మాణానికి సంబంధించి పైలాన్ తో పాటు రూ. 250 కోట్లతో మెడికల్ కళాశాల నుంచి దుప్పలపల్లి వరకు నిర్మించే హ్యం రోడ్డుకు కూడా శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు.
రూ.430 కోట్లతో ఎస్ఎల్బీసీ కాలువ లైనింగ్ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు.
బహిరంగ సభలో పాల్గొనే సీఎం రేవంత్ రెడ్డి గారు నల్గొండ నియోజకవర్గానికి మరిన్ని అభివృద్ధి పనులు ప్రకటిస్తాడని తెలిపారు.
బహిరంగ సభను ఊహించని స్థాయిలో విజయవంతం చేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పేరు నిలబెట్టాలని కోరారు.
ఈ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి లు మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు, ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని విధాలుగా అండగా ఉంటున్నాడని తెలిపారు.
నిరంతరం నల్గొండ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నాడని అన్నారు.
బహిరంగ సభ విజయవంతం కోసం పార్టీ ప్రజా ప్రతినిధులంతా శక్తివంతన లేకుండా కృషి చేయాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో నల్లగొండ డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, తిప్పర్తి,నల్లగొండ పిఎసిఎస్ చైర్మన్ లు ఆలకుంట నాగరత్నం రాజు, పాశం సంపత్ రెడ్డి,పలువురు కార్పొరేటర్లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు,పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments