ePaper
Thursday, June 25, 2026

ఉమ్మడి నోటిఫికేషన్ ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేయాలి – టీఆర్టీఎఫ్ విజ్ఞప్తి

నల్లగొండ, జూన్ 23 :(చీకటి వెలుగు )

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 1కు ముందు నోటిఫికేషన్ విడుదలై, ఆ తరువాత నియామకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను వర్తింపజేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) నల్లగొండ జిల్లా శాఖ స్వాగతించింది.
ఈ నిర్ణయంపై లబ్ధిదారులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంఘం తరఫున అభినందనలు తెలిపింది. ఉమ్మడి రాష్ట్రంలో ఒకే నోటిఫికేషన్, ఒకే నియామక ప్రక్రియ ద్వారా ఎంపికై, రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో విధుల్లో చేరిన ఉద్యోగుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవీయ దృక్పథంతో వ్యవహరించిందని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకుందని టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నిమ్మనగోటి జనార్ధన్, ప్రధాన కార్యదర్శి తరాల పరమేశ్ యాదవ్ పేర్కొన్నారు.
అదే నియామక ప్రక్రియ ద్వారా తెలంగాణలో విధుల్లో చేరిన వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పటికీ పాత పెన్షన్ ప్రయోజనానికి దూరంగా ఉండటం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ కూడా తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని, తద్వారా పదవీ విరమణ జీవితానికి భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని టీఆర్టీఎఫ్ నల్లగొండ జిల్లా శాఖ విజ్ఞప్తి చేసింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!