చీకటి వెలుగు నల్లగొండ.
ఈనెల 26న తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల రాష్ట్ర సదస్సు హైదరాబాదులోని స్వకులశాలి సమాజ భవనం, ఎల్బీనగర్ లో నిర్వహించబడు సందర్బంగా గోడ పత్రిక నల్లగొండ – సూర్యాపేట జిల్లా కమిటీ
కార్యాలయం LPT మార్కెట్,లో ఆవిష్కరించటం జరిగింది.
ఈ సదస్సు లో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ద్వారా చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మరియు పద్మశాలి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ మొదలైన అంశాలపై చర్చించడం జరుగుతుంది అని తెలిపారు.
నల్లగొండ – సూర్యాపేట జిల్లాల పద్మశాలి ఉద్యోగులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర సదస్సు విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యేశాల విశ్వ కుమార్ లతో పాటుగా జిల్లా కమిటీ సభ్యులు పున్న వేణు, ఆనందపు సత్యనారాయణ, గంజి నవీన్ కుమార్, గంజి వెంకన్న, దొంత దామోదర్, దునుకు జగదీశ్వర్, పగిడిమర్రి శివ కుమార్, చిలుకూరి గోవర్ధన్ పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments