వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని పలు గ్రామాల్లో మద్యం నియంత్రణకు గ్రామపంచాయతీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గ్రామాల్లో మద్యం విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తీర్మానాలు ఆమోదిస్తున్నాయి.
మద్యపానం కారణంగా కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నాయని గ్రామస్థులు, ముఖ్యంగా మహిళలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
గ్రామాల్లో శాంతిభద్రతలు, కుటుంబ సంక్షేమం, యువత భవిష్యత్తు దృష్ట్యా మద్యం నిషేధానికి సంబంధించిన తీర్మానాలను గ్రామసభల్లో ఆమోదిస్తున్నారు.
ఈ చర్యలతో గ్రామాల్లో గొడవలు, కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు సామాజిక వాతావరణం మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments