భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో గొప్ప గౌరవం లభించింది.
అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ (AIAA) 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక “గాడర్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు”ను చంద్రయాన్-3 మిషన్‌కు ప్రదానం చేసింది.
అమెరికాలో జరిగిన AIAA ASCEND 2026 కాన్ఫరెన్స్‌లో భారత రాయబారి వినయ్ క్వాత్రా ఇస్రో తరఫున ఈ అవార్డును స్వీకరించారు.
చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించగా, చంద్రయాన్-3 ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
ఈ అవార్డు భారత అంతరిక్ష పరిశోధన సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపుగా భావిస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments