ePaper
Saturday, April 18, 2026

ఎస్‌పీఎస్ కార్మికుల ధర్నా నోటీసుపై చర్చలు

శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ (SPS) అసోసియేషన్ ఇచ్చిన ధర్నా నోటీసుపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహం స్పందించారు.

డి ఎం ఈ కార్యాలయంలో కార్మికులు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, IFMISలో విలీనం చేయాలని, హెల్త్ కార్డు, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో మంత్రి కార్మిక సంఘ నాయకులను పిలిచి చర్చలు జరిపి, జూన్ నెలాఖరుకల్లా వేతనాల్లో పెంపు ఉంటుందని, సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అయితే తమ ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య, ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్ తెలిపారు.

ఇప్పటికే రెండు సంవత్సరాలుగా తగిన వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, కరోనా సమయంలో కీలక సేవలు అందించినప్పటికీ సరైన గుర్తింపు లభించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!