ePaper
Sunday, September 6, 2026

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

విద్యార్థుల పై లాఠీ చార్జీ చేయించిన దేశ ప్రధాని భేషరతుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్.

నల్లగొండ.భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహం ముందు నిరసన, నిర్వహించారు. ఈ సందర్భంగా ‍ SFI జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, DYFI జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ, NTA ను రద్దు చేయాలని ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలనే డిమాండ్లతో ఢిల్లీలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీ చార్జ్ పిరికిపందల చర్యని ఈ ఘటనకు బాద్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది…*
నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ, నీట్ విద్యార్థులకు చావులకు బాధ్యతవహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆధ్యర్యంలో22 రోజులుగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థి సంఘాలు, సామాజిక వేత్త లు శాంతియుతంగా నిరసనకు దిగితే ఎలాంటి చర్చలు జరపని కేంద్రం… ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తే మాత్రం పోలీసులు, పారామిలటరీ దళాలతో అణచివేయడం దారుణమని వారు మండి పడ్డారు. ఇంతటి అలజడికి కారణమైన మోడీ తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని.. అలాంటి హక్కును కాలరాయడం బీజేపీకి కొత్తేమీ కాదని వారు అన్నారు. పోలీసుల పేరుతో ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్ నాయకులు పోలీసులు మారువేషంలో వచ్చి విద్యార్థులపై తీవ్రంగా దాడి చేయడం అత్యంత దుర్మార్గమని . ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పనులు చేపడితే దేశ యువత రాజ్యాంగ పద్ధతిలోనే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో SFIజిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ మారుపాక కిరణ్,కార్లపూడి రాము,నవదీప్ ,చంటి,చారి, మనోజ్, వరుణ్, అంజి, శ్రీను తదితరులు పాల్గొన్నారు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!