చీకటి వెలుగు – నల్గొండ:
విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదలలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని నిరసిస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) ఆధ్వర్యంలో ఆగస్టు 1న నిర్వహించనున్న ‘ఛలో హైదరాబాద్ – మహా ధర్నా’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నల్గొండలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు బత్తిని భాస్కర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రేణికుంట్ల రాజశేఖర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల వంటి డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న ఈ మహా ధర్నాలో ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర శిక్షణ కో-కన్వీనర్ రవీందర్, రాష్ట్ర కార్యదర్శి ఇరుగు శ్రీరాం, రాష్ట్ర వెబ్ కో-కన్వీనర్ కంచనపల్లి విజయ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, టీపీయూఎస్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments