ePaper
Saturday, April 18, 2026

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC)గా విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠాను ప్రభుత్వం నియమించింది.

ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

పునేఠా 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇంతకుముందు 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ కాలంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను విజిలెన్స్ కమిషనర్‌గా నియమించింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీకాలం గత నెల 31తో ముగియడంతో, కొత్త ఎస్‌ఈసీగా పునేఠాను నియమించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!