హైదరాబాద్:
రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 51,92,220 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది.
విడుదల చేసిన గణాంకాల ప్రకారం:
పురుష ఓటర్లు: 25,37,136 మంది మహిళా ఓటర్లు: 26,54,453 మంది ఇతర ఓటర్లు: 631 మంది
మొత్తం ఓటర్లలో మహిళల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. తుది ఓటర్ల జాబితా విడుదలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments