ePaper
Friday, May 15, 2026

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు… సామాన్యుడిపై మరో భారం

దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. పెరిగిన ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి.

పెట్రోల్‌పై లీటరుకు రూ.3.29 పెంచగా, తాజా ధర రూ.112.50కు చేరింది. అలాగే డీజిల్‌పై లీటరుకు రూ.3.15 పెంపుతో ధర రూ.100.22గా మారింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, గ్లోబల్ ఉద్రిక్తతల ప్రభావంతో ఈ ధరల పెంపు జరిగినట్లు సమాచారం.

ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!