చీకటి వెలుగునల్లగొండ,
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చేవెళ్ల డిక్లరేషన్‌లో దళితుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామీల అమలులో జాప్యం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. నల్లగొండ టౌన్‌లోని పీఆర్‌టీ భవన్‌లో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ నూతన జిల్లా కమిటీ ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడి పాపయ్య మాదిగ మాట్లాడుతూ, దళితుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేసి దళితులకు న్యాయం చేయాలని కోరారు. హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నూతన జిల్లా కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా పోతెం సహదేవుడు మాదిగ, ఉపాధ్యక్షులుగా సందే యేసు మాదిగ, ఆదిమూల నగేష్ మాదిగ, బరిగల యాదయ్య మాదిగ, ప్రధాన కార్యదర్శిగా ఏడుకొండల మాదిగ, కార్యదర్శులుగా కొండ్రపల్లి నగేష్ మాదిగ, నూకపండు మధు మాదిగ, కొండేటి మధు మాదిగ, గద్దల నాగయ్య మాదిగ, కొమ్ము గిరి మాదిగ, జిల్లా అధికార ప్రతినిధిగా చింత సైదులు మాదిగ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కంబాలపల్లి వెంకటయ్య మాదిగ, రాష్ట్ర నాయకులు మేడి నరసింహ మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంజీ సైదులు మాదిగతో పాటు నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, మండల అధ్యక్షులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దళితుల హక్కులు, సంక్షేమం కోసం మరింత బలంగా పోరాటాలు నిర్వహిస్తామని నాయకులు తెలిపారు. దళితుల సంక్షేమ హామీల అమలుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments