ePaper
Friday, September 4, 2026

బీజేపీ మేధావి విభాగం జిల్లా కన్వీనర్‌గా పున్న రవీందర్

చీకటి వెలుగు నల్గొండ:

జిల్లాలోని మేధావి, విద్యావంత వర్గాలను సంఘటితం చేసి జాతీయవాదాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. బీజేపీ మేధావి విభాగం జిల్లా కన్వీనర్‌గా పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయుడు పున్న రవీందర్‌ను నియమిస్తూ పార్టీ జిల్లా కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మేధావి వర్గాల పాత్ర కీలకమని, వారి సేవలను పార్టీ కార్యకలాపాలకు అనుసంధానం చేసేందుకు రవీందర్‌కు ఈ బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. జిల్లాలోని మేధావులు, విద్యావంతులను సంఘటితం చేసి జాతీయ భావాలను మరింత బలోపేతం చేస్తారనే నమ్మకంతో ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. పున్న రవీందర్ మాట్లాడుతూ బీజేపీ మేధావి విభాగాన్ని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. విద్యావంతులు, మేధావులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి జాతీయ భావన, దేశభక్తిని పెంపొందించేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. జిల్లాలో ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు చేపట్టి విభాగాన్ని బలోపేతం చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, నల్గొండ పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, కర్ణాటి యాదగిరి, ఉట్కూరు వెంకటరెడ్డి, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు బుర్రి నగేష్ యాదవ్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!