ePaper
Friday, September 4, 2026

ఆగస్టు 24 నుంచి తెలంగాణవ్యాప్తంగా నిరవధిక బంద్‌కు పిలుపు

చీకటి వెలుగు నల్లగొండ,

ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టు 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేయాలని డ్రైవర్లు, రవాణా రంగ కార్మికులకు జేఏసీ విజ్ఞప్తి చేసింది. మైలేజ్, చివరి మైలు రవాణా పేరుతో ఆర్టీసీ నిర్వహిస్తున్న విద్యుత్ ఆటోల సేవలను నిలిపివేయాలని, తెలంగాణవ్యాప్తంగా 60 కిలోమీటర్ల అనుమతి విధానాన్ని అమలు చేసి ఆటోలకు ఒకే అనుమతి విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు పథకాన్ని ఎత్తివేసి, ఆ పథకం వల్ల ఉపాధి కోల్పోయిన రవాణా రంగ కార్మికులకు నెలకు రూ.15 వేల నిరుద్యోగ భృతి అందించాలని కోరారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మృతి చెందిన 210 మంది డ్రైవర్ల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందించాలని, ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఓలా, ఉబర్ ఆధారిత వాణిజ్య ద్విచక్ర వాహన సేవలను నిషేధించడంతో పాటు ఆటో, క్యాబ్ ఛార్జీలను పెంచాలని కోరారు. డ్రైవర్ల ప్రమాద బీమాను ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు రూ.20 లక్షలకు పెంచాలని, డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు నిండిన రవాణా రంగ డ్రైవర్లకు పింఛను పథకం అమలు చేయాలని, డ్రైవర్లు, రవాణా కార్మికులకు ఉద్యోగుల రాష్ట్ర బీమా, ఉద్యోగుల భవిష్య నిధి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌టీయూటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాజరల్లి మీర్జా, జిల్లా ఉపాధ్యక్షులు ఈదుల వెంకన్న, గొలుసు శంకర్ బాబా, డీవీకే రోడ్ ఆటో యూనియన్ అధ్యక్షులు భాషాపాక యాదయ్య, పట్టణ అధ్యక్షుడు డి. వెంకటేష్, చర్లపల్లి అధ్యక్షుడు యాదయ్య, శంకర్, కేశవులు, ముంత ఎంకన్న, వజ్రయ్య, మోదుగుల రాంబాబు, నరేందర్, నరేంద్ర పాలకూరి, నాగరాజు, విద్య రామమూర్తి, బొంగరాల నాగయ్య, బాలస్వామి, రామినేని రహీం బాబా, వెంకన్న, పాలకూరి నాని, సుధాకర్ రెడ్డి, పాలకూరి శీను, టి. శీను తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్ల న్యాయమైన హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా నిలిచి, ఆగస్టు 24 నుంచి చేపట్టనున్న నిరవధిక బంద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!