చీకటి వెలుగు నల్లగొండ.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 56 శాతం ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభలలో ఇంతవరకు ప్రాతినిథ్యం దక్కలేదని, బీసీలలో చైతన్యంతోనే జిల్లాలో బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం సాధ్యమని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు అన్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా బీసీఐఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల హక్కులకై సామాజిక న్యాయ పోరాట సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును వెంటనే రాష్ట్రపతి ఆమోదంతో రాజ్యాంగంలోని 9 వ షెడ్యూలులో చేర్చాలని, చట్టసభలైన లోక్ సభ, శాసనసభలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, తెలంగాణలో స్వతంత్ర కమీషన్ వేసి ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను పునః సమీక్షించాలని, బీసీల జనాభా దామాషా ప్రకారం కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు చేయాలని, బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని తీసుకువచ్చి సమర్ధవంతంగా అమలుచేయాలని, బీసీల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలుచేయాలని, విద్యాహక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తూ చట్టంలోని సెక్షన్ 12 (1)(బి) ప్రకారం ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలల్లో బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలని, కార్పోరేట్ విద్యాసంస్థల ఫీజులపై నియంత్రణ చట్టం తీసుకువచ్చి అమలుచేయాలని, జాతీయ కులగణనలో ప్రతి కుటుంబానికి ఒక యూనిక్ నెంబర్ ఇవ్వాలని, హైకోర్టు, సుప్రీమ్ కోర్టుతో సహా ఉన్నత న్యాయ వ్యవస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం/రిజర్వేషన్ కల్పించాలని, విద్యార్థుల స్కాలర్షిప్ లు, ఫీజు రీయింబర్సుమెంట్స్ సమస్యలను పరిష్కరించాలని, తెలంగాణలో ఖాళీగా ఉన్న సుమారు 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, జీవో 55 ను పునరుద్ధరించాలని, ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, విద్య, ప్రభుత్వరంగ సంస్థలు, రాజ్యాంగ సంస్థలు, కమిషన్ లు, కార్పొరేషన్లు తదితర రంగాల్లో, నామినేటెడ్ పోస్టులలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలని, కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్రంలో బీసీల హక్కుల సాధన కోసం, బీసీలను చైతన్యపరుస్తున్నామని, భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించేదాకా విశ్రమించేది లేదని అన్నారు.
విశిష్ట అతిథిగా హాజరైన శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్ధిక రంగాలలో ప్రాతినిధ్యం కల్పించాలని, జనాభాలో దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయింపులు జరగాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ద్వారా చిరంజీవులు గారు రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాలలో చైతన్యం కలిగిస్తున్నారని అన్నారు.
మాజీ ఎంఎల్సీ పూల రవీందర్ గారు మాట్లాడుతూ బిసి ఉద్యమము ఎదగాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ విఠల్ మాట్లాడుతూ రాజ్యాధికారం సకల సమస్యలకు పరిష్కారమన్నారు.
చెరకు సుధాకర్ బీసీ లో ఐక్యత పెరగాలని కోరారు.
బీసీఐఎఫ్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ నేలపట్ల చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో బీసీఐఎఫ్ జిల్లా కోఆర్డినేటర్లు గుండెబోయిన జానయ్య యాదవ్, ఆమంచి అంజయ్య, సుంకరి బిక్షంగౌడ్, చక్రహరి రామరాజు, దుడుకు లక్ష్మీనారాయణ, మిర్యాల యాదగిరి, చెన్న శ్రీకాంత్, రావిరాల నర్సయ్య, నల్లా సోమమల్లయ్య, కొంపెల్లి భిక్షపతి, ఎం ఏ కరీం, కొన్నె శంకర్ గౌడ్, రాపోలు పరమేష్, పాపని వెంకటరమణ, అయితగోని జనార్దన్ గౌడ్, శిరందాసు రాందాసు, ముచ్చర్ల ఏడుకొండలు, పంకజ్ యాదవ్, కంది సూర్యనారాయణ, జవ్వాజి వెంకటేశం, మండలి రవికుమార్, ప్రొ.వీరస్వామి, అవ్వారు వేణు, చామకూర రాజు, కె వి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments