ePaper
Friday, September 4, 2026

ఫుట్‌పాత్‌లపై మటన్, చేపల విక్రయాలకు అనుమతి లేదు**

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కమిషనర్

*నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫుట్‌పాత్‌లు, రోడ్లు, ప్రజా ప్రదేశాల్లో మటన్, చేపల దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు నిర్వహించడం ఇకపై అనుమతించబడదని మున్సిపల్ కమిషనర్ **శ్రీ బి. వంశీ కృష్ణ తెలిపారు.

ముఖ్యంగా ఆదివారాల్లో ఫుట్‌పాత్‌లపై మటన్, చేపల విక్రయాలు నిర్వహించడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో పాటు, మాంసం, చేపల వ్యర్థాలను రోడ్లు, డ్రైన్లలో పడవేయడం వల్ల అపరిశుభ్రత, దుర్వాసన, ప్రజారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇకపై అనుమతి/లైసెన్స్ కలిగిన దుకాణ ప్రాంగణాల్లో మాత్రమే మటన్, చేపల విక్రయాలు నిర్వహించాలి. ఫుట్‌పాత్‌లు, రోడ్లు, ప్రజా ప్రదేశాలను వ్యాపార కార్యకలాపాలకు వినియోగించరాదని కమిషనర్ స్పష్టం చేశారు.

తెలంగాణ మున్సిపాలిటీల చట్టం, 2019లోని సెక్షన్ 146(3) మరియు మాంసం కోయడం/వధకు సంబంధించిన సెక్షన్ 152 తదితర సంబంధిత నిబంధనల ప్రకారం మున్సిపల్ అధికారులు చర్యలు చేపడతారని తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘించి ఫుట్‌పాత్‌లపై మటన్ లేదా చేపల విక్రయాలు నిర్వహించినట్లయితే వ్యాపారం నిలిపివేత, ఆక్రమణ తొలగింపు, లైసెన్స్‌పై చర్యలు, అవసరమైన సందర్భాల్లో దుకాణం సీజ్ చేయడం, సామగ్రి స్వాధీనం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

ప్రజారోగ్యం, పారిశుధ్యం, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మటన్, చేపల వ్యాపారులు మున్సిపల్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ కోరారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!