25 ఏళ్ల కాంగ్రెస్ సీనియర్ నేత పాపయ్య గౌడ్ రాజీనామా.
చీకటి వెలుగు నల్లగొండ.
కనగల్ మండల కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మండలంలోని ధర్వేశిపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్మగొని పాపయ్య గౌడ్,గ్రామ ఉపసర్పంచ్ కొమ్మగొని జానకమ్మతో కలిసి గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.తమ రాజీనామా పత్రాన్ని గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు పాలకూరి సైదులు గౌడ్‌కు అందజేశారు.ఈ సందర్భంగా పాపయ్య గౌడ్ మాట్లాడుతూ,తాను గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో పనిచేశానని, గ్రామ శాఖ అధ్యక్షుడిగానూ సేవలందించానని తెలిపారు. ప్రస్తుతం తన భార్య జానకమ్మ గ్రామ ఉపసర్పంచ్‌గా కొనసాగుతున్నప్పటికీ, పార్టీ కార్యక్రమాలు, గ్రామపంచాయతీ వ్యవహారాల్లో తమను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో జరిగే కార్యక్రమాల గురించి కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని, తనను లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నందున మనస్థాపానికి గురై పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ధర్వేశిపురం శ్రీ ఎల్లమ్మ ఆలయ ధర్మకర్తగా కూడా సేవలందించిన పాపయ్య గౌడ్, ఆగస్టు 15లోపు మరో రాజకీయ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments