చీకటి వెలుగు నల్లగొండ,
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే జయశంకర్ తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు. వెంకటేశ్వర్లు, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతిలాల్ తదితరులు పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments