లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మానస గ్లోబల్ ఆవిర్భావం,
లయన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేవీ ప్రసాద్.
చీకటి వెలుగు నల్లగొండ.
ప్రపంచంలోని అనేక దేశాలలో లయన్స్ క్లబ్ సేవలు విస్తృతంగా సాగుతున్నాయని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కె వి ప్రసాద్ అన్నారు. మంగళవారం రాత్రి స్థానిక లయన్ భవన్లో నూతనంగా లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మానస గోల్డ్ ను ఇన్స్టాలేషన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ నల్లగొండలో సుమారు 1500 మంది లయన్స్ ఉన్నారని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలు వీల్స్ ఆన్ మీల్స్ స్కీం పేరుతో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అల్పాహార భోజనం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. నూతనంగా ఏర్పడ్డ లైన్స్ క్లబ్ గ్లోబల్, అధ్యక్షుడు మంత్రవాది శ్రవణ్ కుమార్ తమ క్లబ్ తరఫున సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేసి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. మనం చేసే చిన్న సాయం వారికి ఎంతో ఉపశమనం కలుగుతుందని అన్నారు. నూతనంగా ఏర్పడ్డ లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మానస గ్లోబల్ అధ్యక్షునిగా మంత్రివాది శ్రవణ్ కుమార్, మొదటి వైస్ ప్రెసిడెంట్గా కందుకూరి సురేష్, రెండవ ప్రెసిడెంట్ గా కరెంటు త్ మంగతా నాయక్, సెక్రటరీగా సింగం నాగేశ్వరరావు,మొదటి జాయింట్ సెక్రటరీగా మందడి లిఖిత, రెండవ జాయింట్ సెక్రటరీగా ధారా రాంబాబు, కోశాధికారిగా గగినపల్లి వెంకటరెడ్డి, కోఆర్డినేటర్ గా మందడి యాదవ రెడ్డి భాస్కర్ రెడ్డి సద్గురు ప్రసాద్ ఎలిషాల న్యూటన్ అనుదీప్ నరేష్ రెడ్డి రవికుమార్ ప్రియాంక సింగం హర్షిత మంత్రవాది ఏంజెల్ రాంపల్లి తదితరులను కోఆర్డినేటర్లనుగా ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన లైన్స్ క్లబ్ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐపిడి జి మదన్ మోహన్ రేపాల, డిస్టిక్ చీఫ్ అడ్వైజర్ జగిని భీమయ్య ఇన్స్టలేషన్ ఆఫీసర్ సతీష్ కుమార్ కోడె వెంకటేశ్వరరావు గుడిపూడి తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments