నల్ల మధు యాదవ్ బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు
సాగర్ల కరుణాకర్ యాదవ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధ్యక్షులు
నీలకంఠం నాగరాజ్ నాగార్జున ప్రభుత్వ కళాశాల అధ్యక్షులు
నల్లగొండ జిల్లా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆగస్టు 7న బెంగళూరులో నిర్వహించనున్న జాతీయ ఓబీసీ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నాయకులు నల్ల మధు యాదవ్ బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఓబీసీల సామాజిక, విద్యా, రాజకీయ హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మా ప్రధాన డిమాండ్లు:
దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో ఓబీసీ కుల గణనను తప్పనిసరిగా చేపట్టాలి.
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలి.
జనాభా నిష్పత్తి ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలి.
పార్లమెంట్, అసెంబ్లీలు మరియు ఇతర చట్టసభల్లో ఓబీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విధంగా రాజకీయ రిజర్వేషన్లను అమలు చేయాలి.
ఓబీసీల హక్కుల సాధన, సామాజిక న్యాయం మరియు రాజ్యాంగబద్ధమైన అవకాశాల కోసం జరుగుతున్న ఈ జాతీయ మహాసభలకు నల్లగొండ జిల్లాలోని విద్యార్థి నాయకులు, యువజన నాయకులు, మహిళా సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మరియు బీసీ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి సంఘం నాయకులు అనుముల మనోజ్ నల్లబోతు మధు పాలకూరి నవీన్ సాయి యాదవ్ జాల పవన్ యాదవ్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments