అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకడులతో నాగార్జున డిగ్రీ కళాశాలలో నిరసన వ్యక్త చేశారు ఈ సందర్భంగా ఎబివిపి జిల్లా కన్వీనర్ కొంపల్లి సూర్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 18 లక్షల పేద విద్యార్థుల ఉన్నత విధ్యాకు ఆధారమైన పీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసి వేసే కుట్ర పన్నుతున్నట్లు అడుగులు వేస్తుందని గత మూడు సంవత్సరాలుగా 11 వేల కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాకుండ విద్యార్థులకు అన్యాయం చేస్తుందని, విద్యార్థులు దోస్త్ ద్వారా అడ్మిషన్లు పొంది కళాశాలల్లో రిపోర్టింగ్ కోసం వెళితే ప్రభుత్వ కళాశాలలు కూడా విద్యార్థుల నుండి ముందే ఫీజు వసూలు చేస్తున్నారని దీని కారణంగా పేద విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక విద్యకు దూరం అవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ వైఖరిని మార్చుకొని పెండింగ్ పీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని లేని పక్షంలో రాబోవు రోజుల్లో ఈ ప్రభుత్వానికి విద్యార్థుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిపర్తి శివ, ఎబివిపి నాయకులు జయందర్, గొట్టిపర్తి శివ ,కార్తీక్, శివ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments