కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన మాల మహానాడు నాయకులు.
చీకటి వెలుగు నలగొండ.
22 రోస్టర్ విధానం వల్ల మాల సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే సరిచేయాలని, ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు, మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో రీలే నిరాహార దీక్ష చేపట్టారు.
మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాలపల్లి రవి, మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, నల్గొండ జిల్లా అధ్యక్షులు బొప్పని నగేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో మాల సంఘాల నాయకులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 22 రోస్టర్ విధానం వల్ల విద్యా ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో మాల యువత నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోస్టర్ విధానాన్ని సవరించి న్యాయం చేయాలని, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉన్న ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం నాయకుల ప్రతినిధి బృందం నల్గొండ జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. మాలలకు న్యాయం జరిగేలా ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని కలెక్టర్‌ను కోరారు.
మాలల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని, ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు బొప్పని నగేష్, జాతీయ అధ్యక్షులు తాలపల్లి రవి, గౌరవ అధ్యక్షులు ఏకుల రాజారావు, జిల్లా కార్యదర్శి వెన్నెమళ్ల అనిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతపల్లి లింగమయ్య, మాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేరా బాలకిషన్, హంస అధ్యక్షులు నామా సైదులు, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వివిధ మండలాల నాయకులు, జేఏసీ ప్రతినిధులు, దళిత హక్కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments