ePaper
Thursday, July 23, 2026

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో తలెత్తుతున్న సమస్యలపై ఈఆర్‌ఓ, ఆర్‌డీఓతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి భేటీ

చీకటి వెలుగు, నల్లగొండ:

నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నేడు నల్లగొండ ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్‌ఓ), రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ)లను వారి కార్యాలయంలో కలిసి ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)లో నల్లగొండ నియోజకవర్గంలో తలెత్తుతున్న పలు సమస్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు పూర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించి, ఓటరు జాబితాలో ఉన్న అనర్హుల పేర్లను తొలగించాలని, అదే సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ముఖ్యంగా నల్లగొండ నగరంతో పాటు పరిసర గ్రామాలకు సంబంధించిన ఓటరు జాబితాల్లో అనేక లోపాలు ఉన్నాయని భూపాల్ రెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో నల్లగొండలో ఉద్యోగాలు చేసి ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి పేర్లు ఇప్పటికీ ఇక్కడి ఓటరు జాబితాలో కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే, ఓటర్లు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రాంతాలకు వారి ఓట్లు బదిలీ అయ్యాయని, ఇలాంటి పొరపాట్లను పూర్తిగా సరిదిద్దాలని కోరారు.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించి, ఎలాంటి తప్పులు లేకుండా తుది ఓటరు జాబితాను రూపొందించాలని ఎన్నికల అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కార్పొరేటర్ బాణావత్ దీప్లా, గోపగోని స్వాతి రాజశేఖర్, దండంపల్లి సత్తయ్య, గుండెబోయిన జంగయ్య, గాదె వివేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!