చీకటి వెలుగు నల్లగొండ,
ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియకు ప్రతి ఓటరు సహకరించాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకూరి నర్సింహా, జిల్లా అధ్యక్షులు బాకీ నర్సింహా పిలుపునిచ్చారు.
దేవరకొండ పట్టణంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణమండపంలో గురువారం చిత్రం ఉదయ్ ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో గుండాల అంజయ్య, చిత్రం ఉదయ్‌తో కలిసి ముత్యాలమ్మ బజార్, సంతోషిమాత కాలనీల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. సమగ్ర ఓటరు సవరణ సర్వేలో భాగంగా గృహ గణన దరఖాస్తు పత్రాలను పంపిణీ చేసి, వాటిని సక్రమంగా నింపి అందించాలని అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అంకూరి నర్సింహా, బాకీ నర్సింహా మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా మరణించిన వారి పేర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్లను తొలగించి, పూర్తి పారదర్శకతతో ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందించడమే లక్ష్యమని తెలిపారు.
ఈ ప్రక్రియపై ఎలాంటి అపోహలు, గందరగోళానికి తావివ్వకుండా ప్రతి ఓటరు బాధ్యతగా పాల్గొని అవసరమైన వివరాలను అందించాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో స్వచ్ఛమైన, పారదర్శకమైన ఓటరు జాబితా కీలకమని పేర్కొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments