విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ, సురక్ష ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో
నిర్వహణ
168 మందికి ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
చీకటి వెలుగు నల్లగొండ :
పేద,మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్లగొండ జిల్లా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం మెగా ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న విశ్వకర్మ భవనంలో ప్రముఖ సురక్ష ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు దాసోజు యాదగిరి చారి, ప్రధాన కార్యదర్శి పెందుట సోములు జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమాజ సేవలో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులతో ఈ ఉచిత శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
శిబిరంలో సురక్ష ఆసుపత్రికి చెందిన నిపుణులైన వైద్యులు రోగులను క్షుణ్ణంగా పరీక్షించి ఈసీజీ (ECG), రక్తపోటు, మధుమేహం తదితర ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. అవసరమైన మందులను పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై విలువైన సూచనలు అందించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కొంతమందిని తదుపరి చికిత్స కోసం సురక్ష ఆసుపత్రికి రిఫర్ చేశారు.
ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో నల్లగొండ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి మొత్తం 168 మంది ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకుని సేవలను వినియోగించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు శ్రీపాద కృష్ణమాచారి, మాజీ గౌరవ అధ్యక్షుడు కొండోజు కృష్ణమాచారి, ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణ కమిటీ కన్వీనర్ కటక వెంకటాచారి, కోశాధికారి తరునోజు భీష్మాచారి, ఉపాధ్యక్షులు బౌరోజు రాఘవాచారి, దాసోజు బ్రహ్మచారి, పందిళ్లపల్లి బ్రహ్మచారి, పగిరోజు ఆచారి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు పోలోజు శ్రీనివాసచారి, దేవులపల్లి వెంకటాచారి, సలహాదారు కంచనపల్లి షణ్ముఖచారి, ఆర్థిక కమిటీ సభ్యుడు చోల్లేటి లక్ష్మణ్, వివాహ పరిచయ వేదిక సహాయకురాలు ఉమారాణి, కార్యదర్శులు కొల్లోజు వంకరచారి, కూరెల రాఘవాచారి, షణ్ముఖచారి, సురక్ష ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది, విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments