ePaper
Sunday, July 5, 2026

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా భాకి నరసింహ బాధ్యతల స్వీకరణ.

చీకటి వెలుగు నల్లగొండ.

ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా భాకి నరసింహ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై భాకి నరసింహకు శుభాకాంక్షలు తెలిపారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం భాకి నరసింహ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి కార్యకర్తతో సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే, దళితుల సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ పక్షాన నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తూ, దళితులను బీజేపీ వైపు ఆకర్షించే విధంగా పనిచేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ విలువైన సమయాన్ని కేటాయించి హాజరైనందుకు భాకి నరసింహ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరికంటి మొగులయ్య, నూకల వెంకట్ నారాయణ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకుర్ నరసింహ, చింత ముత్యాలరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, జిల్లా నాయకులు గోలి ప్రభాకర్, ఓరుగంటి వంశీ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పిండి పాపిరెడ్డి, ఎడ్ల రమేష్, ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు పెరికి మునికుమార్, నల్గొండ మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్, కనగల్ మండల అధ్యక్షుడు పల్సనబోయిన బిక్షం, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కొత్తపల్లి వెంకట్, నాయకులు మంగళపల్లి కిషన్, గుండా నవీన్ రెడ్డి, ఆది మల్ల దేవేందర్, కొత్తపల్లి ప్రమోద్, కందుకూరి సుధాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, నల్ల నరసింహ, మహిళా నాయకురాలు తార, ముస్కు పృద్వి, చింతపల్లి వెంకన్న, ఇరిగి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!