ePaper
Tuesday, September 8, 2026

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పారదర్శకంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

మిర్యాలగూడ, జూలై 4: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ బీఎల్‌ఓలను ఆదేశించారు.

శనివారం మిర్యాలగూడ మున్సిపాలిటీ 3వ వార్డులోని 133, 134 పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యుమరేషన్ ఫారాల్లో 2002 ఓటరు జాబితాలో ఉన్న వారి వివరాలు, జాబితాలో లేని వారి వివరాల నమోదుపై ఆరా తీశారు. అలాగే బీఎల్‌ఓల వద్ద ఉన్న ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి సహకరిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమం నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో విధులు నిర్వర్తించాలని బీఎల్‌ఓలకు సూచించారు.

ఇళ్లకు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను అందరూ తిరిగి సమర్పిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్న కలెక్టర్, ఎవరైనా ఇంట్లో అందుబాటులో లేకపోతే మరోసారి ఆయా ఇళ్లను సందర్శించి వారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!