నల్లగొండ: నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్, ఆర్టీసీ కాలనీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లావణ్య హాస్పిటల్ ప్రారంభోత్సవం జూలై 2న (గురువారం) ఉదయం 11 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, డిప్యూటీ మేయర్ మొహమ్మద్ అలీ అహ్మద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య, 4వ డివిజన్ కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ అతిథులుగా పాల్గొననున్నారు.
అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డా. కె. రాహుల్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (DCHS) డా. డి. మైత్రి ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు.
డా. వి. రవిప్రసాద్ (ఎండీ పల్మనాలజీ), డా. లావణ్య ఆధ్వర్యంలో ప్రారంభమవుతున్న ఈ ఆసుపత్రిలో ఛాతీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ఆధునిక వైద్య సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్య సలహాలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments