ePaper
Monday, July 27, 2026

ఆటో ఓనర్స్, డ్రైవర్స్ సమస్యలు పరిష్కరించాలి..

చీకటి వెలుగు నల్గొండ.

నల్లగొండ పట్టణ ఆటో ఓనర్స్, డ్రైవర్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆటోలు బంద్ నిర్వహించి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ , అధ్యక్షులు కలగొని యాదగిరి మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో, ప్రస్తుతం ఉన్న చార్జీలతో ఆటోలు నడపలేకపోతున్నామని, ఇవే కాక ఓలా, రాపిడో ఆన్లైన్, సర్వీసులతో మాకు ఇబ్బందికరంగా ,నష్టం జరుగుతూ జీవనం గడవడం కష్టమవుతున్న నేపథ్యంలో, ఇబ్బంది నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తున్నామని. కావున మాపై భారం పడకుండా ప్రభుత్వం ఆలోచించి జీవనోపాధికి తోడ్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు దశరథ ,రాము, విధుల వెంకన్న, వైరు సత్తయ్య, బాబు మతిన్, రాంబాబు, చోటు రాజు సోహెల్, లింగరాజు సల్మాన్, రోశయ్య సత్తయ్య ఎస్ కే హలీం శేఖర్, లింగరాజు, పట్టణంలోని ప్రధాన కోడలు గల జేఏసీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!